అచేతన స్థితిలో ఉన్న పార్టీ నీ అధికారం వైపు తీసుకొచ్చేలా కష్టపడ్డాను.
,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని నమ్ముతున్నాను .
చెన్నూర్ నేటి ధాత్రి::
కాంగ్రెస్ అధిష్టానం పేర్కొన్న ప్రకారం రాష్ట్రం లొ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, సీనియర్లకు స్థానిక సంస్థలలో, వివిధ కార్పొరేషన్ లలో చోటు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ కావడం తో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేస్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాతర్ల నాగరాజ్ పోటీ పడుతున్నారు.గత ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడిన,ప్రలోబాలు చూపించిన వాటికి బెదరకుండా , లొంగకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కోసం కష్టపడ్డాను అన్నారు.2004 లో ఇంటర్ చదివే రోజుల్లో ఎన్ ఎస్ యూ ఐ లో స్టూడెంట్ యూనియన్ గా పనిచేశాను,2006 సం:లో ఎన్ ఎస్ యూ ఈ టౌన్ అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాను, 2010 లో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను,అలాగే తెలంగాణ మలి దశ ఉద్యమం లో పెద్దపల్లి పార్లమెంట్ ఎం పి ఇప్పటి చెన్నూర్ ఎం ఎల్ ఏ వివేక్ వెంకట స్వామి కి మద్దతుగా యువకుల అమరన్ దీక్షలో పాల్గొన్నను అన్నారు.2020 లో జరిగిన మున్సిల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఫామ్ ఇస్తము అని ఆఫర్ చేసిన కూడా అప్పటి పార్టీ కి భయపడి ఎవరు ముందుకు రాలేదు.నేను నా భార్య పోటీలో నిలబడి వారి బెదిరింపులకు భయపడకుండా పార్టీ కోసం పోటీలో నిలిచాయి అన్నారు. సీపీఐ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా చెన్నూర్ టికెట్ కాంగ్రెస్ కు మాత్రమే ఇవ్వాలని పెద్దపల్లి లోని రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్లకార్డులతో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు..పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భముగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ గురించి దైర్యంగ నిరసన తెలిపినందుకు అరెస్ట్ కూడా అయినను అని తెలిపారు.2014 నుంచి కాంగ్రెస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి 2024 అధికారం లోకి వచ్చేవరకు పార్టీ కోసం కష్టపడ్డాను అన్నారు.కావున పార్టీ కోసం ఇంతలా కష్టపడ్డ తనకే మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇవ్వాలని చెన్నూర్ పార్టీ అధ్చిష్టానన్ని నియోజకవర్గ ఎం ఎల్ ఏ వివేక్ వెంకటస్వామి కి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.