హసన్ పర్తి నేటిధాత్రి:
తేదీ 28- 02- 2024 బుధవారం నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వంగపహాడ్ లోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా ముస్కు వర్షిత ఐదవ తరగతి విద్యార్థిని వ్యవహరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు వారు బోధనలో నిత్యం ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలు బోధిస్తున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.క్రమశిక్షణతో పట్టుదలతో కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చు అని కష్టపడడం కంటే ఇష్టపడి చదువుకోవాలని తెలిపారు. విద్యార్థులు వారి స్వయం అనుభవాలను వివరించారు. భవిష్యత్తులో బాగా చదువుకొని ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నామని వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణకుమారి, ఉదయ్ కుమార్ , రాణి , మాలతీదేవి, శ్రీ వర్ధన్ రెడ్డి , పుష్ప ,భాను మొదలగు వారు పాల్గొన్నారు