మంగపేట నేటి ధాత్రి
జడ్పిహెచ్ఎస్ మల్లూరు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా పాఠశాలను నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలను వివిధ టిఎల్ఎం ఉపయోగించి బోధించారు .కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా దిడ్డి లక్ష్మీప్రసన్న, కలెక్టర్ గా చిడెం సాహితి ,ఆర్జెడిగా హుమేర అంజుo ,డీఈవో గా గాదె జ్యోతిక ,ఎమ్మెల్యే గా కొదురుపాక జస్వంత్, ఎం ఈ ఓ గా తాండ్ర నందిని వ్యవహరించారు. బోధనలో మొదటి బహుమతి ఎంపల్లి చాందిని, ద్వితీయ బహుమతి గన్నోజు చరణ్య గెలుపొందారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా భద్రయ్య, ఉపాధ్యాయులు కొ రస సారయ్య, కోడి వెంకటేశ్వర్లు ,ఈసం కృష్ణవేణి, ఈసo అనసూర్య ,అబ్బు సత్యనారాయణ ,జమీల్ , రఘు ,సురేందర్ మరియు న్యాయ నిర్ణయితలుగా నాలి రాంబాబు ఆగబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.