లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి;
డిసెంబర్ 3వ తేదీన లక్షెట్టిపేట లోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల బాలుర కళాశాలలో నిర్వహించినటువంటి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి అథ్లెటిక్స్లే పోటీలలో లక్షిటిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం. లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 7, 8 ,9 తేదీలలో హనుమకొండలోని JNS స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పీడి పీఈటి మల్లికా మమత తెలిపారు. గెలుపొందిన విద్యార్థులు వివరాలు
ఎం .రశ్మిత- 1500 మీటర్స్
ఎం.మనోహరికా-100 మీటర్స్
సి.హెచ్. సహస్ర షార్ట్ పుట్
డి. దీపిక హై జంప్
జె.సంజన 400 మీటర్స్
బి .స్వర్ణ విజేత 800 మీటర్స్ కె.కుంకుమ 3KM రన్ లో పాల్గొంటారు. వీరిని కళాశాల ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి గారు మరియు వైస్ ప్రిన్సిపల్ కె మహేశ్వర రావు గారు ,అండర్/19 ఎస్ జి ఎఫ్ సెక్రటరీ బాబురావు గారు మరియు కళాశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.
