కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా స్థాయి లో ఎస్ జీ ఎఫ్ ఐ నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో జెడ్పిహెచ్ఎస్ కల్వల పాఠశాల నుండి వివిధ విభాగాలలో పది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ గంటా సంజీవరెడ్డి,ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకటరామ నరసయ్య,వ్యాయామ ఉపాధ్యాయురాలు బి.జ్యోతి,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గొట్టం రోజా రాణి,కె.సమ్మిరెడ్డి,డీకే వెంకటేశ్వర్లు,ఏ.శ్రీనివాస్,ఆర్. బిక్షపతి,ఎం.ఏకాంబరం,వి.రాజేంద్ర చారి,బి.బాలషోరెడ్డి,ఏ. వెంకటేశ్వర్లు,వి.రాము,ఆర్ లక్ష్మీనారాయణ హాజరై భినందించారు.కాగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు సిహెచ్ సంతోష్ 87 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, బి. చరణ్ 60 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, బి సింధు 42 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఏం .సాయి చరణ్ 35 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, డి .హరిణి 36 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, టి. సాయిశా 36 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, కే .అశ్విని 33 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఏ. శైలజ 30 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఏ .బన్నీ 62 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఏ .పృద్వి 38 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయికి ఎంపికయారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.