నర్సంపేట,నేటిధాత్రి :
రైతులకు విక్రయించే విత్తనాలను ఎమ్మార్పీ రేట్లకే అమ్మకాలు చేయాలని టాక్స్ ఫోర్స్ ఏడిఏ శ్రీ నగేష్ విత్తన దుకాణాల యజమానులను హెచ్చరించారు.నర్సంపేట పట్టణంలోని పలు విత్తనాల దుకాణాల్లో నర్సంపేట
ఏడిఏ సురేష్ ఆధ్వర్యంలో అకస్మిత తనిఖీలు నిర్వహించారు.పలు విత్తన దుకాణాల్లో విత్తన ప్యాకెట్లను, స్టాక్ రిజిస్ట్రార్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా టాక్స్ ఫోర్స్ ఏడిఏ శ్రీ నగేష్ మాట్లాడుతూ విత్తనాలు తీసుకునే సమయంలో సంబంధిత రసీదులను తప్పకుండా తీసుకోవాలని కొనుగులు చేసిన విత్తన ఖాలీ ప్యాకెట్లను,రసీదులను భద్రపరచుకోవాలని పేర్కొన్నారు.
అధీకృత విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.పూర్తి వివరాలతో బిల్లులు ఇస్తూ ఎమ్మార్పీ రేట్లకే విత్తనాలు అమ్మాలని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ నర్సంపేట మండల అధికారి కృష్ణ కుమార్,
జిల్లా విత్తన దృవీకరణ అధికారులు వేణు,విజయ్, ఏఈఓ నవీన్ పాల్గొన్నారు.