నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
జాతీయ సైన్స్ దినోత్సవ ము పురస్కరించుకొని కమలాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాలలో బుధవారం సైన్స్ మేళా నిర్వహించారు.సైన్స్ మేళా లో పాఠశాల కాంప్లెక్స్ లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని తమ తమ ఎగ్జిబిట్ ను ప్రదర్శించారు. వీరితో పాటు మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాస రచన ఉపన్యాస పోటీలు మరియు నృత్య పోటీలు శాస్త్ర సాంకేతిక అంశాలపై నిర్వహించారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి,శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి రాంకిషన్ రాజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం రాజమల్లయ్య గారు కాంప్లెక్స్ లోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పవన్ కుమార్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, కాంతయ్య, ప్రకాష్ రావు, శ్రm ప్రశాంతి, ఉషా రమనీ తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందచేశారు.