*18 నెలల వేతన బకాయిలు చెల్లించండి నిరవధిక సమ్మె ప్రారంభం*
*CITU జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి*
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల అనుబంధ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని గిరిజన కార్మికుల ఆకలి బాధలు తీర్చండి అంటూ
నిరవధికసమ్మె చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారుజోక్యంచేసుకునివేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు.భద్రాచలంలోCITU ఆధ్వర్యంలో సమ్మెప్రారంభించి మాట్లాడారు. పోస్టుమెట్రిక్ హాస్టల్స్ ఔట్సోర్సింగ్ వర్కర్లు మరియు ఆశ్రమ పాఠశాలల ఐదు నెలల వేతన బకాయిల సమ్మెచేస్తున్నారు. 18 నెలలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని CITU తెలిపింది.ప్రభుత్వం దృష్టికి సమస్యలను ఎన్నిసార్లు తీసుకెళ్లిన స్పందించలేదన్నారు. ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న వేతనాల చెక్కును వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లకు రావలసిన ఐదు నెలల జీతాలు ఇవ్వాలని కోరారు వేతనాల సమస్యను పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని CITU విమర్శించింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయని ఇప్పటికైన వేతనాలు కార్మికుల అకౌంట్లో జమ చేయాలని
CITUడిమాండ్ చేశారు. జీతం లేకుండా ఎలా బతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిఐటియు కోరింది సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రభుత్వం అధికారులు కార్మికుల సమస్యలు అంటే చులకన భావంతో ఉన్నారని పేర్కొన్నారు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలోనే పదో తరగతి పరీక్షలు ఉన్నాయని ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవట్లేదు కాబట్టే సమ్మె చేయటం తప్ప మరొక మార్గం లేదని సిఐటియు పేర్కొన్నది 12,500 ఉన్న జీతాన్ని 9 వేలకు తగ్గించాలని ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని సిఐటియు పేర్కొన్నది డైలీ వేజ్ వర్కర్లకు 2023 జిల్లా కలెక్టర్ కనీస వేతనాలు సర్కులర్ అమలు చేసి వేతనాలు పెంచాలని ఏరియర్స్ తో సహా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పనిచేస్తున్న కార్మికులకు లో క్యాటరింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది సమస్యల పరిష్కరించకపోతే సమ్మెను ఉదృతంచేస్తామని CITUహెచ్చరించింది.సమ్మెకు ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని సిఐటియు పేర్కొన్నది. కార్యక్రమంలో CITU నాయకులు నాగరాజు,హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ ,నాయకులు రామారావు,సుభద్ర ,శ్యామల,నాగమణి ఆదిలక్ష్మి,కాంతమ్మ,దర్మమ్మ,రామయ్య,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు