రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలకి సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎంపిడివోకు వినతిపత్రం అందజేశారు. ఈవినతిపత్రంలో పదవీకాలం 1పిబ్రవరి2024 వరకు ముగుస్తున్నందున, ఎంపీ ఎన్నికలు మే 2019, కరోనాకాలం ఆతర్వాత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జూన్ 2019, సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చిన తేదీ 2నవంబర్2019(తోమ్మిది నెలలో చెక్ పవర్ లేని), కరోనాకాలం దాదాపు రెండు సంవత్సరాల పదవీకాలం వృధా అయినందున మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి నిధులు(ఎస్పిఎఫ్) ఇరవై నెలల నుంచి రావడం లేనందున కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా పద్నాలుగు నెలల నుండి రాకపోవడం మిగతా సమయంలో అడపాదడపా జమా కావడం జరిగినదని దీని ద్వారా మాకు అర్థికంగా భారీ నష్టం జరిగినదని మరియు నెలనెలకు జమ అయ్యే నిధులు జమ కాకపోవడం వల్ల చేసిన పనులకు బిల్లులు రాక, మెయింటెనెన్స్ చేయుటకు కూడా నిధులు లేక అప్పులు తీసుకువచ్చి మాసొంత నిధులతో గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగినదని కాబట్టి 1జనవరి1994 నుండి 31మార్చి1996 వరకు ఏవిధంగానైతే సర్పంచ్ లకు రెండు సంవత్సరాల పర్సనల్ ఇన్చార్జిగా పదవికాలం పెంచారో అదేవిధంగా మాకు పదవి కాలం పెంచుటకై ఈవిషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మాసమస్యని పరిష్కరిస్తూ, పెండింగ్ బిల్లులను విడుదల చేయవలసిందిగా వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.