యార అజేయ్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి; లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ పై మహారాష్ట్ర షిండే గ్రూప్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ( రాహుల్ గాంధీ గారి నాలుక కట్ చేసి తీసుకువస్తే 11 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తా) అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని అన్నారు. ఈ సందర్బంగా యార అజయ రెడ్డి మాట్లాడుతూ… ఈ దేశం లో రిజర్వేషన్లు లేకుండా చెయ్యాలి అని చూస్తున్న బిజెపి , వాటి కూటమి పార్టీలు ఇప్పుడు కావాలని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వాక్యాలను, బీజేపీ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50% కన్నా రిజర్వేషన్ లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. తను చేసిన వాక్యాలను ఇతర పార్టీ వాళ్ళు కావాలని తప్పుగా వక్రీకరించి చూపిస్తున్నారు అని అన్నారు. కానీ బిజెపి మిత్రపక్షం అయన మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే గైక్వాడ్ ని అడ్డం పెట్టుకొని కావాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంజయ్ గైక్వాడ్ ను తక్షణమే శిక్షించాలి అని యార అజయ రెడ్డి డిమాండ్ చేశారు.
