నేటిదాత్రి తాండూరు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో పోచమ్మ గుడి ఆవరణలో చెత్త చెదారంతో నిండి వాసన రావడంతో పోచమ్మ గుడి పక్కన హనుమాన్ గుడిలో ఉన్న హనుమాన్ భక్తులు ఇట్టి విషయాన్ని గమనించి.. గ్రామపంచాయతీ కార్యదర్శి కి శనివారం సమాచారం అందించగా వెంటనే స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి తేజ గ్రామ పోచమ్మ గుడి ఆలయానికి వచ్చి కారబర్ తిరుపతి ని పిలిపించి గుడి ఆవరణలో ఉన్న చెత్త ను తరలించి వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చెల్లించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి సమస్య అయినా నా వరకు సమస్యలు చేరేవేస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు.. సమాచారం అందించిన వెంటనే స్పందించిన గ్రామ కార్యదర్శి కి హనుమాన్ భక్తులు మరియు గుడి ఆవరణలోని కాలనీవాసులు శభాష్ పంచాయతీ కార్యదర్శి అని అభినందించారు.