రైతు వేదికలు నిరుపయోగం

కానరాని రైతు సదస్సులు… సమావేశాలు

నిర్వహణ లేక అద్వానస్థితికి

వేములవాడ రూరల్ నేటిధాత్రి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, వేములవాడ రూరల్ మండల కేంద్రంలో పంట సాగులో అధునాతన పద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసే ఉద్దేశంతో నెలకొల్పిన రైతు వేదికలు వృథాగా మారాయి. అన్నదాతలకు అవగాహన కల్పించడం, రైతులంతా ఒకేచోట సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలనునిర్మించింది. ఆలోచనమంచిదే అయినా ఆచరణలో శున్యం గా కనిపిస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు క్రమం తప్పకుండా రైతులతో సమావేశాలు నిర్వహించక పోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన వేదికలు ఏమాత్రం ప్రయోజన కరంగా లేవు. పంటల సాగు, వాతావరణ పరిస్థితుల పై అవగాహన, శిక్షణ కల్పించడంలో రైతు వేదికల ను ఉపయోగించడమే మరిచిపోయారు. ఆధునిక విధానాల అమలుపై నేటి వరకు ఒక్క ప్రదర్శన కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టరు ఏర్పాటు చేసి, ఇందుకు అనుగుణంగా వేదికలను నిర్మించింది.వేములవాడ, వేములవాడ రూరల్ మండల కేంద్రంలో అయిదు క్లస్టర్లు ఉన్నాయి. ప్రతీ రైతు వేదికకు ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద రూ.12 లక్షలు, గత రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు కేటాయించింది. కొన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరుగుతున్నా చాలా చోట్ల గ్రామానికి దూరంగా నిర్మించడం, నిర్వహణ ఖర్చులు సరిగా రాకపోవడంతో రైతులు వెళ్లడానికి ఇష్ట పడటం లేదు.

రైతు వేదికలో జరగాల్సినవి..

ప్రతీ వారంలో రైతులతో సమావేశం నిర్వహించి శాస్త్రవేత్తల సలహాలు, సాగు పద్ధతులు, మెలకువలు, పలు పంటలు తెగుళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకోవడంపై వివరించాలి. రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి వ్యవసాయ అధికారులు వివరించాలి. సమావేశాలు జరగనప్పుడు వీటి గురించే వివరించే వారు లేరు. రైతులు ఎక్కడ దొరికితే అక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి సమావేశాలు నిర్వహిస్తు అధికారులు కాలం వెల్లదీస్తున్నారు.

నిర్వహణ ఖర్చులురాక నిర్వీర్యం..

ప్రతీ నెల రైతు వేదికల నిర్వహణ ఖర్చుల కింద రూ. 9వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వ చెబుతోంది. రైతు వేదికలు 2020–21 అందుబాలులోకి వచ్చాయి. అప్ప టి నుంచి కేవలం 5 నెలలకు సంబంధించి నిర్వహణ ఖర్చులు విడుదలయ్యాయి. రూ.45 వేలు మంజూరుచేసి ఈ డబ్బును వ్యవసాయ విస్తరణ అధికారులు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ప్రతీ నెల కరెంట్‌ బిలుకల రూ.1000, స్వీపర్‌ వేతనం రూ.3వేలు, తాగునీటి అవసరాలకు రూ.500, స్టేషనరీకి రూ.1000, సమావేశాల నిర్వహణకు రూ. 2,500, ఇతర ఖర్చులకు రూ.వెయ్యి ఖర్చు చేయాల్సి ఉంది. కాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిర్వహణ ఖర్చులో కరెంట్‌ బిల్లు, స్వీపర్‌ బిల్లు ఖచ్చితంగా చెల్లించాలి. మిగతా వాటిపై మండల వ్యవసాయాధికారులకే తెలియాలి.

ఎరువులు, విత్తనాలు ఎక్కడ..

రైతు వేదికల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందించేందుకు ప్రభత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కానీ, అందించిన దాఖాలాలు ఎక్కడా కనిపించ లేదు. ఊరికి దూరంగా ఉండడంతోపాటు సిబ్బంది కొరత కారణంగా ఎరువులు అమ్మాలంటే అధికారులు జంకుతున్నారు. దీంతో చాలామంది రైతులు వివిధ గ్రామాల్లో ఉన్న సహకార సంఘాల గోదాములో, ప్రవేటు వ్యాపారుల నుంచి ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఎంతో ఆర్భాంటగా రైతు వేదికలు నిర్మించి రైతులకు సేవలందిచాలకున్న ప్రభుత్వల లక్ష్యం నీరుగారుతోంది. రైతు వేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, లేనట్లయితే ఇవి గోదాములు మారి నిరుపయోగంగా తయారువుతాయని రైతలు ఆవేదన చెందుతున్నారు

ఏఈవోలు ఉండాల్సిందే..

క్లస్టర్‌ ఒకరు చొప్పన వ్యవసాయ విస్తీర్ణాధికారుల (ఏఈవో) ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రైతు వేదికల నిర్వహణ వ్యవహారమంతా ఏఈవోలు చూసుకోవాలి. ఏఈవోలు నిత్యం రైతువేదికలకు రావాల్సిందేనని, అక్కడ ఏర్పాటు చేసిన రిజిష్టర్‌లో సంతకం చేయాలని గత ప్రభుత్వం కొత్తనిబంధన తెచ్చింది. ఒక వేళ ఎక్కడికైనా వెళ్తే రిజిస్టర్‌లో వివరాలు రాసి పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మండలాల్లో పర్యటనకు వచ్చే జిల్లా అధికారులు ప్రత్యేకాధికారులు రైతు వేదికలను సందర్శించాలని సూచించింది.

సమావేశాలకు అనుమతి…

రైతు వేదికలు అన్నిశాఖలకు వేదికగా ఎప్పుడు మారనున్నాయి. ఎవరైనా ఇక్కడ సమావేశాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించేలా చూడలి అని ఇప్పటికైనా రైతు వేదికలు వినియోగం లోకి తెచ్చి అధికారులు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు తెలుసుకునే విదంగా అందుబాటులో ఉండాలని ప్రజలు రైతులు కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version