సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా రైతుబంధు నిధులు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని. వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం కామ్రేడ్ కొప్పుల శంకర్ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పై నిత్యం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీ-సేవ కేంద్రాల్లో ప్రజల నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్నియు అమలు చేయాలని కోరారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ… నెల రోజులు గడుస్తున్నా.. రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లో పడడం లేదని అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు పేరుకుపోయినప్పటికీ అవి పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నారని. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి కౌన్సిలర్లు… వారం రోజుల నుండి రిసార్ట్స్ లలో తిరుగుతూ.. క్యాంపు రాజకీయాల్లో ఉన్నారని. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఈ క్యాంపు రాజకీయాలకు తీరదించాలని డిమాండ్ చేశారు. పాలకులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయాలని. అలా కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసే ప్రజాప్రతినిధులను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మతోన్మాదం ఎజెండాతో ప్రజలను చీల్చుతూ పబ్బం గడుపుతుందన్నారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నిర్లక్ష్యం చేస్తుందని. 700 మంది రైతులు రైతు ఉద్యమంలో అమరులైతే, నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి.. కేంద్రం దొడ్డి దారిన వాటిని అమలు చేయాలని చూస్తుందని. 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తూ కార్మిక వర్గంను బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం బడా ప్రైవేటు కార్పోరేటు సంస్థలకు గంప గుత్తగా అమ్మకానికి పెడుతూ.. దేశ సంపదని మొత్తం లూటీ చేస్తూ… దేశంలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, ఓట్ల రూపంలో మలుచుకుంటుందని, దేశంలో వెనకబాటుతనం, నిరుద్యోగం, ప్రజల్లో ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, సభ్యులు బాషీర సంపత్ రావు, చేల్పూర్ రాములు, దండిగారి సతీష్ పాల్గొన్నారు.