చౌటుప్పల్ లో ఘనంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు.

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్:భారత రాష్ట్ర సమితి నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలను మునుగోడు నియోజకవర్గ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక బస్టాండ్ మైదానం లో ఆందోజు శంకరా చారి ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హాజరై కేకు కట్ చేసి ప్యాక్స్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి గారికి తినిపించటం జరిగింది. తదుపరి రక్తదాన శిబిరం ప్రారంభించి మొదటగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు డిల్లి. మాధవరెడ్డి గారు రక్త దానం చేసారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుర్వీ యాదయ్య గౌడ్ గారు, స్థానిక మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ తాడురి పరమేష్, మల్లారెడ్డి గూడెం సర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్వీ ఇన్చార్జి నలపరాజు రమేష్, తెలంగాణ ఉద్యమనాయకులు శ్రీరాముల నరసింహ, నీళ్ళ లింగుస్వామి, రఘు గౌడ్, చంద్రశేఖర్ మరియు పెద్దఎత్తున స్థానిక యువకులు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా పల్లె రవికుమార్ మాట్లాడుతూ డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప దార్శనిక నాయకులని,కెసిఅర్ పాలనలో పేద బిడ్డల కు గొప్ప విద్యను, ఉద్యగాలను, అవకాశాలను కల్పించడంలో గొప్ప పాత్ర పోషించారని కొనియాడారు. చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉన్నత పాత్రను పోషించబోతున్నారని జోస్యం చెప్పారు. అందోజు శంకరా చారి మాట్లాడుతూ ఆర్ ఎస్పీ గారికి మునుగోడు ఉపఎన్నిక ద్వారా ప్రత్యేక అనుభందం ఉన్నదని, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కెసిఅర్ కేటీఆర్ నాయకత్వం లో ప్రభుత్వ అసమర్థ పాలనపై క్రియాశీలక ఉద్యమాలను చేయటంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతో దిగిపోయి కెసిఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. జిల్లా బిఆర్ ఎస్ నాయకులు పూడరీ సైదులు మాట్లాడుతూ రానున్న ప్రభుత్వంలో డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి గా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికై పనిచేస్తారని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచుల, ఎంపీటీసీ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు నర్రా నిర్మల, పోకల ఎలిజబెత్, వేముడాల రాణి, అంజన్ కుమార్, పుదారు కృష్ణ, చిలకరాజు శివ, నాగేంద్రబాబు, కదారీ సైదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!