గర్జించిన ఓరుగల్లు తూర్పు

నన్నపనేని నామినేషన్ (విజయోత్సవ) ర్యాలీ

నరేందర్ గెలుపుకై కదం తొక్కిన తూర్పు ప్రజలు

భారీ జనసంద్రం మధ్య, కనివిని ఎరుగని రీతిలో కొనసాగిన నామినేషన్ ర్యాలీ

వరంగల్ తూర్పు రోడ్లన్నీ గులాబీమయం, విజయాన్ని తలపించిన నామినేషన్ ర్యాలీ

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు నియోజకవర్గ దిక్కులన్నీ పెక్కటిల్లేలా, కాలనీలు అన్ని, గులాబీ జెండా నీడన అడుగులో అడుగేస్తూ గులాబీ దండు గర్జిస్తూ కదిలింది. శివనగర్ లోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నివాసం నుండి ప్రారంభమైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ నామినేషన్ ర్యాలీ, శాసనమండలి డిప్యూటీ చేర్మెన్, బిఆర్ఎస్ వరంగల్ తూర్పు ఇంచార్జ్ బండా ప్రకాష్ తో కలిసి పోస్టాపిసు, చౌరస్తా, జేపిన్ రోడ్, మండిబజార్,పోచంమైదాన్, గోపాలస్వామి గుడి, ఎంజిఎం సర్కిల్ మీదుగా అశేష జనవాహిని మధ్య గులాబీ దండు కదన రంగంలో ముందుకు సాగింది. ఇది నామినేషన్ ర్యాలీనా లేక విజయోత్సవ ర్యాలీనా అనే తీరుగా ఎమ్మెల్యే నరేందర్ నామినేషన్ ర్యాలీ కొనసాగింది. డబ్బు చప్పుళ్ళు, మహిళల కోలాటాలు, కళాకారుల ఆట పాటలతో, కార్యకర్తల కేరింతల నడుమ ఓరుగల్లు పురవీధులు జయహో నరేందర్ నినాదాలతో దద్దరిల్లింది. ఎంజిఎం సెంటర్ లో, భారీ గజమాలతో శాసనమండలి డిప్యూటీ చేర్మెన్, ఎమ్మెల్యే నరేందర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ గజమాలతో అభిమానులు సత్కరించారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చేరెన్స్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్, చేర్మెన్ బొల్లం సంపత్ కుమార్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, పోశాల పద్మ స్వామి గౌడ్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామిలతో కలసి వెళ్లి ఎమ్మెల్యే నామినేషన్ సమర్పించారు. నామినేషన్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వన వరంగల్ తూర్పు ప్రజల ఆశీర్వాదంతో గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసాను అని, నేను చేసిన అభివృద్ధి మీ కళ్ళముందు ఉంది, తూర్పు ప్రజలే నా కుటుంబ సభ్యులుగా నేను లోకల్ అండర్ బ్రిడ్జి దగ్గరే నా ఇల్లుంది, అందరికి అందుబాటులో ఉన్న నన్ను గెలిపించండి అండగా ఉంటా అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తా అని, మరోమారు ఓరుగల్లు తూర్పు ప్రజల దీవేనలతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆదరించండి, కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యావత్తు వరంగల్ తూర్పు బలగం మొత్తం ఎమ్మెల్యే నరేందర్ గెలుపునకై కదిలాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version