జిల్లాలో అర్హులైన పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి

భద్రాచలం నేటి ధాత్రి

గుత్తి కోయ ఆదివాసీలను ఎస్టీలుగా గుర్తించి సంక్షేమ చర్యలు చేపట్టాలి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డిమాండ్

జిల్లాలో పోడు సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలని పోడు భూములకు. సాగునీరు సౌకర్యం కల్పించాలని గిరిజన ఇతర పేదలకు గుత్తి కోయ ఆదివాసులకు కూడా పట్టాలి ఇవ్వాలని వారిపై అటవీ అధికారులు అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గుత్తి కోయ ఆదివాసుల గ్రామాలకు రహదారి మంచినీరు కరెంటు బడి విద్య వైద్యం ఉపాధి కల్పించాలని వారి గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా వారిని.ఎస్టీలుగా గుర్తించి పై చదువులకు ఉద్యోగాలకు ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు కల్పించాలని. అన్ని ప్రభుత్వ సబ్సిడీ పథకాలు వారికి వర్తింప చేయాలని వారు అన్నారు

సోమవారం 1.7. 2024.భద్రాద్రి కొత్త గూడెం భద్రాచలంలో పోడు సాగు దారులు బ్రిడ్జి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఐటిడిఏ కార్యాలయం వరకు ర్యాలీ జరిపి ధర్నా నిర్వహించారు సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ జిల్లా నాయకురాలు కల్పన అధ్యక్షతన జరిగింది.

కెసిఆర్ నాయకత్వం లోని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ పట్టాలు ఇవ్వలేదని గిరిజన ఇతర పేదలను గుత్తి కోయ ఆదివాసి ఎడల వివక్షత చూపిందని విమర్శించారు ఒక్క ఆదివాసులకు మాత్రమే పట్టాలిస్తామని ప్రకటించి సుమారు లక్షమంది మూడు లక్షల ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా 50వేల మందికి మాత్రమే ఒక లక్ష యాభై వేలు ఎకరాలకు పట్టాలిచ్చి చేతులు దులుపుకుందని నాయకులు విమర్శించారు. ఫలితంగా అటవీ అధికారులు సాగుదారులకు పట్టాలు లేవనే పేరుతో సాగుదారులను ట్రాక్టర్లు తో దున్న రాదని,విద్యుత్ బోర్లు వాడరాదని బెదిరిస్తున్నారు . గొత్తి కోయ ఆదివాసీల సాగును అడ్డుకుంటున్నారు బెదిరిస్తున్నారు ములకలపల్లి మండలంలోని రాసన్న గుట్ట గ్రామంలో జెసిబిలు తెచ్చి దాడి చేసి సాగు భూమిని జూన్ 7న లాక్కున్నారు గత సంవత్సరం ఇలాగే 70 ఎకరాలు బలవంతంగా గుంజుకున్నారని నాయకులు ఆరోపించారు ఇది దుర్మార్గమైన విషయం అన్నారు.ఇట్టి పరిస్థితుల్లో జిల్లాలో అర్హులైన వారందరికీ పోడు పట్టాలి ఇవ్వాలని అటవీ అధికారుల దాడులు బెదిరింపులు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. గొత్తి కోయ ఆదివాసి అభివృద్ధికి. రాజ్యాంగబద్ధంగా అన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నాయకులు డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి ప్రభాకర్ ,నూప భాస్కర్ ,కంగాల కల్లయ్య పోతుగంట లక్ష్మణ్, తోడెం. దుర్గమ్మ. మాచర్ల సత్యం, మధుసూదన్ రెడ్డి, భద్రాచలం డివిజన్ నాయకులు సాయన్న చరణ్,మునిగిల శివ ప్రశాంత్, పాలం చుక్కయ్య, సుజాత, శాంతక్క మహేశ్వరి.తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version