గుండాల మండల అధ్యక్ష, కార్యదర్శులు సనప కుమార్, పూనెం మంగయ్య
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ మహాసభల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి గుండాల మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువతరానికి ,ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగం రోజు, రోజుకు పెరిగిపోతుందని, సమస్యను పరిష్కరించకుండా మరో మారు యువతను మోసగించడానికి పాలకులు ఎన్నికల ప్రచారంలోకి దిగారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.60 కోట్లు ఓటర్స్ ఉండగా, యువకుల ఓట్లు1.60 కోట్లు ఉన్నాయని విరు చైతన్యవంతంగా ఆలోచన చేసి ఓటు వేసినప్పుడే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారన్నారు.