సింగరేణి మల్టీ డిపార్ట్మెంట్ టీం నిర్వాహణ గురించి సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని అధికారులు మరియు యూనియన్ ప్రతినిధులతో మల్టీ డిపార్ట్మెంట్ టీం నిర్వహణ గురించి సమీక్షతేదీ.10.12.2024 (సోమవారం) న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని అధికారులు మరియు యూనియన్ ప్రతినిధులతో మల్టీ డిపార్ట్మెంట్ టీం నిర్వహణ మరియు దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసే సమీక్ష సమావేశం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జిఎం ఎం. షాలేం రాజు హాజరుకాడమైనది.

ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగుదారులకు అందించేందుకుగాను ప్రతి ఒక్కరు మనకు నిర్దేశించిన లక్ష్యన్ని రక్షణతో సమైఖ్యంగా, సమర్దవంతంగా, సక్రమంగా, నిజాయితీతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్దికి కృషి చేయాలనే దృక్పదంతో మొత్తం 11 ఏరియాలలో మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో బాగంగా మన కొత్తగూడెం ఏరియాకు మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ మీటింగ్ తేదీ.10.12.2024 నుండి 14.12.2024 వరకు కొత్తగూడెం ఏరియాలోని అన్ని ఉపరితల గనులు మరియు అండర్ గ్రౌండ్స్ డిపార్ట్మెంట్లలో ఈ మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది.

ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్థ యొక్క స్థితిగతులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడంలో మరియు సంస్థను ముందుకు తీసుకుపోవడంలో వారి బాధ్యత ఎంతుందో తెలుసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

అనంతరం డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్ మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం యొక్క ఉద్దేశమును అనగా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, మిషనరీ పనితనం, ఉత్పత్తి వ్యయం మరియు ఉద్యోగుల సంక్షేమ కొరకు సింగరేణి సంస్థ తీసుకుంటున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన ఉద్యోగులందరికీ వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్.ఓ.టు జిఎం జి.వి. కోటిరెడ్డి ఎజిఎం (ఫైనాన్స్) కే. హనా సుమలత, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, డిజిఎం(ఐఈడి) ఎన్.యోహాన్, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ఏజెంట్ బి రవీందర్, ప్రాజెక్టు ఆఫీసర్ ఎం. శ్రీ రమేష్, ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version