బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టం అని, తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిన గొప్ప ఘనత అని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రైతన్నలకు రేవంతన్న ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం పట్ల రైతుబిడ్డగా తనకు ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయం ఒక పండగల..రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
