తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి:
తొర్రూరు డివిజన్ కేంద్రంలో రుణమాఫీ కానీ రైతులతో బి ఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
ప్రజలు అంటే పట్టింపు లేదు రైతులు అంటే లెక్కలేదు
మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తాను అన్నాడు చేశాడా?
ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్ళపై ఒట్టు పెట్టాడు
రేవంత్ రెడ్డి మొనగాడులా ముచ్చట్లు చెప్పి, చేతలలో మోసగాడుగా మారి ఎల్లెలకల పడ్డాడు
రుణమాఫీ అయ్యింది తక్కువగా కానోల్లు ఎక్కువగా ఉన్నారు
భార్య పేరు వంకతో, ఆధార్ కార్డు వంకతో, బ్యాంక్ పాస్ బుక్ లో లోపల వంకతో రైతుల రుణమాఫీని ఆపారు, ఆయన భాగోతం ప్రజలందరికీ తెలిసింది
రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు నేడు రేవంత్ రెడ్డినీ మోసగాడు అంటున్నారు
కాంగ్రెస్ పార్టీ వారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన మోసపూరితమైన హామీలను ఇస్తున్నారు
రుణమాఫీ అయ్యిందా?
కౌలు రైతులకు 15 వేలు వచ్చాయా?
వ్యవసాయ కూలీలకు 12 వేలు వచ్చాయా?
మూతపడ్డ చెక్కెర కర్మాగారం తెరిసిండా?
రాహుల్ గాంధీ అయినా కనీసం హామీలు ఇచ్చాం ఇవ్వన్నీ అమలు చేస్తున్నారా? లేదా? అని అడుగాలా? లేదా?
ఇవ్వాలా రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది
హైడ్రా పేరుతో హైదరాబాద్ లో పేదల ఇళ్లను కూల గోడుతున్నారు, పేదల ఇళ్లను కూలిస్తే మేము చూస్తూ ఊరుకోం
రైతుబంధు ఇస్తామని చెప్పిండు ఇచ్చారా?
దసరా పండుగ లోపు రైతులకు రైతు బందు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంక్ లో వేయాలి
ఎలాంటి ఆంక్షలు లేకుండా జూట మాటలు మాట్లాడకుండా రైతు రుణమాఫీ చెయ్యాలి
నిన్ను అడుగుతాం, నిన్ను కడుగుతాం, నిన్ను అసెంబ్లీలో నిలబెడతాం
ఆరు హామీలలో ఒక్క బస్సు తప్ప అంతా తుస్సే అయ్యింది
బస్సుల సంఖ్యతో పాటుగా ట్రిప్పులు కూడా తగ్గాయి
రెండు లక్షల మీద ఉన్న డబ్బు కట్టండి వెంటనే రుణమాఫీ చేస్తామని సీఎం అన్నాడు మరీ మా పాలకుర్తిలో రైతులు కట్టారు వారికి వెంటనే రుణమాఫీ చెయ్యాలి
డోర్నకల్ మండలం దరావత్ తండాలో ఒక రైతు, దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో సురేందర్ రెడ్డి అనే రైతు రుణమాఫీ కాక చనిపోయారు
కెసీఆర్ ది రైతు గుండె, రేవంత్ రెడ్డిది రాతి గుండె
కెసీఆర్ గారు కరోనా సమయంలో అందరి జీతాలు ఆపీ మరీ రైతులకు రైతుబందు ఇచ్చాడు
రైతు బంధు, రైతు భీమా, సాగునీరు, త్రాగునీరు ఇచ్చింది కెసీఆర్
రేవంత్ రెడ్డి అన్ని పంటలకు భోనస్ అని చెప్పాడు ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని మాట మార్చాడు
ధగా కోర్, జుటా కోర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్టా
నేను వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్నావు కాదా? మరీ ఇచ్చవా?
రేవంత్ రెడ్డి పిల్లల్ని, తల్లుల్ని, తండ్రులని, ఉద్యోగస్తులను, రైతులను, నిరుద్యోగులను మోసం చేశాడు
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హామీ ఇచ్చారు
ప్రాణం పోతే ప్రాణం రాదు, మీరు అదైర్య పడవద్దు, మీకు అండదండగా మేము ఉంటాము
వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు కాంగ్రెస్ ఎమ్మేల్యేలు వస్తే రైతులు, ప్రజలు నిలదీయాలని కోరారు
బతుకమ్మ పండుగకు చీరలు బందు అయినాయి, కెసీఆర్ కిట్లు బంద్ అయ్యాయి
దేవుడిపై ఓట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు మొదలయ్యాయి
దాడులు, తిట్ల దండకం ఎవ్వరూ ఎత్తుకుంటారు చేతగాని వాళ్ళే అవునా? కదా?
ఆరు గ్యారంటీలే కాకుండా ఏడవ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు ఇస్తావని చెప్పి నేడు ఏమీ చేస్తున్నావు
హైడ్రా పేరుతో అన్ని కూలగొడతా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా.. రా.. కూలకొట్టు
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాది ప్రజాపక్షమే
పాలకుర్తిలో ఒక్క ఓటు ఇద్దరు ఎమ్మేల్యేలు అయ్యారు
ఒడిపోయాను అని వేరే వారెవరైనా ఇంట్లో ఉంటారు కానీ దయాకర్ రావు మాత్రం మీతోనే ఉంటున్నాడు
బతుకమ్మ పండుగకు చీర వద్దు 500 ఇస్తనని అన్నావు కదా ఇవ్వు 500
వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తావని అన్నావు కదా ఇవ్వు
కరెంట్ ఎందుకు వస్థలేదు అంటే తోండలు వచ్చినయి, హరీష్ రావు లైన్ మెన్ కి ఫోన్లు చేస్తుండు అంటున్నారు
ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా? నేను నడుపుతున్నానా?
దేవుడా ఈ పాపాత్ముడు మీపై ఒట్టు వేసి అబద్ధాలు, మోసం చేశాడు ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడు అని యదాద్రికి వెళ్లి నేను మొక్కుకుంటే నాపై కేసులు పెట్టారు
తెలంగాణ ఉద్యమంలో నాపై 300 కేసులు పెట్టారు నాకు కొత్తనా కేసులు
నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను వదిలేది లేదు
రేవంత్ రెడ్డి రైతులకు బాగా మంచి చేశాడని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటా
స్టేషన్ ఘన్ పూర్ లో బై ఎలక్షన్స్ వస్తాయి మనం తాటికొండ రాజయ్యను గెలిపించుకుందాం
రుణమాఫీ కాలేదని మీరు వస్తె మేము 500 చొప్పున ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళను తిట్టిస్తున్నామని నాపై, కేటీఆర్ గారిపై విమర్శలు చేస్తున్నారు
వెంటనే షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి అన్నారు
నిరసన ధర్నా లో పాల్గొన్న మాజీ మంత్రులు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.మాజీ ఎంపీ మలోతు కవిత.పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.మాజీ స్పీకర్ మధుసూదనా చారి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. స్థానిక నాయకులు పాల్గొన్నారు