త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టిన పంచాయతీ సెక్రెటరీ
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి లోని త్రాగునీరు పంపు దగ్గర వాహనదారులు బండ్లు కట్టడం వల్ల నీరు కలుషితం అవుతుందని మిట్టపల్లి పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లగా తను స్పందించి ఆదివారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందితో త్రాగునీరు పంపు వద్ద పిచ్చి మొక్కలు తొలగించి బోరు కేసింగ్ లోకి నీరు వెళ్లకుండా సిమెంటు, ఇటుకలతో దిమ్మె నిర్మిస్తామని చెప్పారు.అలాగే వాహన చోదకులు ఎవరైనా అక్కడ బండ్లు కడిగినట్టు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువస్తే జరిమానా విధించబడుతుందని గ్రామస్తులకు తెలియజేశారు.