మద్యం ముట్టను, మాంసం తినను
మాచర్ల స్రవంతి భద్రయ్య.
మరిపెడ నేటి ధాత్రి.
బీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్త ప్రతిన బునారు బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి మాజీ మంత్రి , సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ భారీ మెజారిటీ తో గెలిచే వరకు మద్యం ముట్టను మాంసం తిననని మరిపెడ మున్సిపల్ కేంద్రానికి చెందిన మాచర్ల భద్రయ్య శనివారం,శ్రీసీతారామాంజనేయ ఆలయంలో ప్రతిన బూనారు,సీఎం కేసీఆర్ అమలు చేయనున్న ఎన్నికల మేనఫెస్టోను సీతారామాంజనేయులు ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, పూజారి ఆశీర్వాదం తీసుకొని ఇంటింటికి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు, అనంతరము ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ సన్న బియ్యం,రూ.400గ్యాస్ అందజేత,రైతు బంధు పెంపు,ఆసరా రూ.5016తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి అండగా ఓటరు దేవుళ్ళు నిలవలన్నారు.అనునిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండే ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మద్దతు ఇవ్వాలని వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.