మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్
-భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ఆపదొస్తే అండగా ఉండి, ప్రజల హృదయాలను దోచుకున్న డైనమిక్ లీడర్..భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గురువారం మొగుళ్ళపల్లి ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత-పున్నం చందర్ రావు ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ చెరువు వద్ద ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలకు 500 ల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. అలాగే పంద్రాగస్టును పురస్కరించుకొని 2 లక్షల రైతు రుణమాఫీని చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న, కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు పొలంపల్లి శంకర్ గ్రామ శాఖ అధ్యక్షులుక్యా తారాజు రమేష్ మల్సాని రాజేశ్వరరావు మహమ్మద్ రఫీబండారి కుమార్ యాదవ్, బండారి విజయ్ కుమార్, పడిదల ప్రకాష్ రావు, పడిదల బాపురావు, ఎలకంటి ముత్యలింగా చారి, , బండారి కొమురయ్య, దేవునూరి నరేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
