అభివృద్ధికి నోచుకునేది ఎప్పుడు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి నుండి మందమర్రి వరకు ఉన్న జెడ్పి రోడ్డును ఎన్నికల ముందు రోడ్డు మరమ్మతులు చేస్తామని గుంతలు చేసి అలాగే వదిలేశారు. గుంతల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారులు రోడ్డు మరమ్మత్తుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. రోడ్డు అభివృద్ధికి వచ్చిన నిధులు ఏం చేశారు. అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్లిన ఏమాత్రం కూడా స్పందన లేదు ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు త్వరగా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు
కోరుతున్నారు.
#రెండు మండలాల సరిహద్దులో ఉన్న రోడ్డు
ఎన్నాలి ఈ దుస్థితి
#జైపూర్ మండలం కాన్కూరు నుండి మందమర్రి మండలం గుడిపల్లి వరకు 2 కిలోమీటర్ల దూరం గల రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి గానీ మరమతుల గానీ నోచుకోలేదు ఈ రోడ్డు, కారణం రెండు మండలాల సరిహద్దుల మధ్య ఉండడంవల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా చీకట్లో ప్రయాణం ఎంత కష్టంగా ఉన్న ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు మారుతున్న, అధికార యంత్రాంగం మారుతున్న ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ఈ దుస్థితి ఇంకా ఎన్నాళ్ళు అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గానీ అధికారులు గానీ చొరవ తీసుకొని రోడ్డునీ అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లాలని గాజుల సదానందం కోరుతున్నారు.