మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో రామగుండం సీపీ సుడిగాలి పర్యటన

హజిపూర్, లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన సిపి

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు, పిడి యాక్ట్ అమలు తప్పదు

మంచిర్యాల నేటిదాత్రి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని హాజీపూర్, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గారు, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఐపిఎస్., లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, గ్రామపంచాయతిలు, ఆమ్లెట్ గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష సమయం కన్నా గంట ముందు పరీక్ష కేంద్రాల చుట్టూ పోలీస్ వారు తనిఖీ చేయడం జరుగుతుంది అన్నారు. ప్రశ్నపత్రాలు తీసుకు వెళ్ళడం ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మరియు జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే వరకు పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఈ బందోబస్త్ ఇంటర్మీడియట్,పదవ తరగతి పరీక్షలు పూర్తి వరకు ఉంటుందని, విద్యార్థులు కూడా పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు ఎవరు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన, పాల్పడటానికి సహకరించిన చట్టపరమైన చర్యలు తప్పవని విద్యార్థులు ఎలాంటి తప్పిదలకు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు.

పీడీఎస్ అక్రమ రవాణా, గుడుంబా, గంజాయి రవాణా పై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి నుండి ఎలాంటి చట్ట విరుద్ధమైన చర్యలు చేపట్టిన సహించేది లేదని ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. అక్రమ దందాలు అరికట్టేందుకు స్థానిక పోలీస్, టాస్క్ ఫోర్క్ పని చేస్తున్నాయని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలో పిడియస్ రైస్ అక్రమ రవాణా చేసే వారిపై కేసులు కూడా చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే బియ్యం ప్రజలకే అందాలని పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడాలని, ప్రజల్లో పోలీసులు మంచి పేరు సంపాదించడమే రామగుండం కమీషనరేట్ పరిధిలో ముఖ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపిఎస్., మంచిర్యాల ఏసిపి ఆర్. ప్రకాష్ ,మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, లక్షేట్టిపేట సీఐ ఏ. నరేందర్ ఎస్‌ఐ లు నరేష్ కుమార్ , లక్షేట్టిపేట ఎస్ఐ చంద్ర కుమార్, జన్నారం ఎస్ఐ సతీష్, సిసిసి నస్పూర్ ఎస్ఐ రవి కుమార్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version