రేగొండ,నేటిధాత్రి:
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్ ఎంపికైనట్లు బాగిర్తిపేట ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు సూదం సాంబమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 13 నుంచి 18 వరకు జరగబోయే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 16 షార్ట్ పుట్ విభాగంలో పాఠశాల పదవ తరగతి విద్యార్థి పోరిక రాహుల్ ఎంపికయ్యాడని హర్షం వ్యక్తం చేశాడు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రేవూరి అనిత రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయని అదే విధంగా క్రీడల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు భవిష్యత్తు ప్రయోజనాలకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు చదువు మరియు క్రీడలు రెండు కళ్ల వంటివన్నారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కొండ శ్రీనివాస్,లెక్కల ఇంద్రసేనారెడ్డి,వేల్పుల రాజు,సంపతి భాగ్యలక్ష్మి,అబ్బోజు అనురాధ,సుధామల్ల మురళి,పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఓనపాకల రాజయ్యరఘు పోరిక రాహుల్ కు అభినందనలు తెలియజేశారు. జాతీయస్థాయిలో కూడా షాట్ పుట్ విభాగంలో గెలుపొంది పాఠశాలకు గ్రామానికి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.