భద్రాచలం నేటి ధాత్రి
సూర్యుడు లోకానికి వెలుగులు ప్రసాదించే దేవుడు మాత్రమే కాదు…. ఎందరికో మార్గదర్శి…
భద్రాచలం : శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ఈరోజు కల్పవృక్ష నారసింహుని దివ్యసన్నిధిలో రధసప్తమి ని పురస్కరించుకొని విశేషపూజాది కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతూ సూర్యుడు సర్వాంతర్యామి అని ప్రతి నిత్యం లోకంలో వెలుగులు నింపుతూ సృష్టి స్థితిలయలను నడిపించే దేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన సూర్య భగవానుడని,యువతకి మంచి మార్గదర్శి సూర్యుడేనని ప్రతి ఒక్కరూ అలుపెరుగనిపోరాటం సూర్యుని ద్వారానే నేర్చుకోవాలని అన్నారు. ప్రతి నిత్యం లోకంలో వెలుగులు పంచే గొప్ప శక్తి గా యువత తయారు కావాలని, కష్టపడి అనుకున్నది సాధించడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని అప్పుడే విజయం మనకు అందుతుందని అన్నారు. జీవితం లో రామ చంద్రునికే కష్టాలు తప్పలేదని చిన్న చిన్న విషయాలకే మనం క్రుంగిపోకూడదని వచ్చిన భక్తులకు యువతకు తెలియజేసి సన్మార్గం లో నడిచి దేశం గర్వించే విధంగా తయారు కావాలని అన్నారు.ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని నోములు నోచినా సత్ప్రవర్తన లేకపోతే ఇదంతా వ్యర్థమని అన్నారు. మనం చేసే ప్రతి పని భగవంతుడు చూస్తూనే ఉన్నాడని ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా మనిషిని మనిషిగా చూస్తే తానే మాధవుడని, ఆదశావతారుడే మానవ రూపం లో అవతరించి ధర్మాన్ని ఆచరించి చూపాడని, ఒక్క సూర్యుడు లోకం అంతటికి వెలుగులు పంచితే మనమందరం మన ఇళ్లల్లో వెలుగులు నింపే సమిధలుగా తయారు కావాలని అప్పుడు ప్రతి ఇల్లు నందన వనమే నని అన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి, పురోహితులు నవీన్ శర్మ,పవన్ శర్మ,శ్రీధర్ శర్మ,శ్రీవిహాన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.