ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య మరియు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజీద్ పాష మాట్లాడుతూ నిన్నటి రోజున తెలంగాణా భవన్ లో ప్రెస్ మీట్ లో మతిభ్రమించి మాట్లాడినటువంటి పుట్ట మధు వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు శ్రీపద రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి ఇంట్లో ఉంటూ కమిషన్లకు కక్కుర్తి పడింది నువ్వు కాదా మంథనిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి నీకు నిద్ర పట్టక మచ్చలేని మా నాయకులపై ప్రభుత్వంపై లేనిపోని అవాకులు చివాకులు పేలుస్తూ మరోసారి ప్రజల ముందు ఆబాసుపాలయ్యారని కక్ష రాజకీయాలు తావులేకుండా మంథని ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నటువంటి దుదిల్ల కుటుంబం పై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కదా ఇసుక అక్రమ రవాణా వ్యాపారం మొదలయింది మీరు మీ అనుచరులు ఇసుక క్వారీల వద్ద వసూళ్లు వసూల్ చేసి ఇల్లు ఆస్తులు లేని నీకు ఇవ్వాళ రాజాగృహం ఖరీదైన కార్లు ఎలా వచ్చాయి మీరు కమిషన్లకు కకృత్తి పడి ఖమ్మంపల్లిలో నిర్మించినటువంటి బ్రిడ్జిపై రాడ్లు తెలుతున్నాయని అన్నారు మంథనిలో 10 ఏళ్ల అరాచక పాలన రౌడీ పాలన నడిస్తే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోక కోలా కంపెనీని నియోజకవర్గంలో ఏర్పాటు చర్యలు తీసుకొని నియోజకవర్గ పరిధిలోని యువత పక్కదారి పట్టకూడదని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంథని ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక పుట్ట మధు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు ఇకనైనా ఈ దిగజారుడు మాటలు మానుకొని మంథని ప్రాంత అభివృద్ధికి సహకరించాలని లేదంటే నియోజకవర్గ పరిధిలోని ప్రజలు మరో సారి బుద్ది చెప్పుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్ , ముత్తారం గ్రామ శాఖఅధ్యక్షుడు అనుము సమ్మయ్య ఓడేడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి అనుము రామస్వామి చొప్పరి సంపత్ వెల్మరెడ్డి శ్రీనివాస్ బాలసాని రాజ్ కుమార్ బండ రాజిరెడ్డి లాక్కెమ్ రాజు సీనియర్ మండల కార్యకర్తలు పాల్గొన్నారు