ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండలం కేంద్రంలోని ఎండపల్లి గ్రామానికి చెందిన పులి ప్రనిక్ రతన్ జాతీయస్థాయి 67వ ఎస్ జి ఎఫ్ సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మారేపల్లి కృష్ణారెడ్డి తెలిపారు జాతీయస్థాయిలో పాల్గొనే ప్రనిక్ రతన్ కు వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి 5000 రూపాయలు మరియు స్పోర్ట్స్ కిట్టును అందజేయడం జరిగింది ప్రనిక్ రతన్ డిసెంబర్ నెలలో 21 నుంచి 23 వరకు నిర్మల్ లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొని మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలు ఈ నెల 10 నుంచి 15 వరకు రాజస్థాన్ జరిగే 67వ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటారు ఈ సందర్భంగా ప్రనిక్ రతన్ ను జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మారేపల్లి కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి ఎంపిటిసి ఎండి బషీర్ సీనియర్ క్రీడాకారులు శ్రీనివాస్ రెడ్డి . రవీంద రేడ్డి ఇబ్రహీం. బి.కొమురయ్య. పులి కిరణ్ కుమార్ గ్రామ ప్రజలు అభినందించారు
