# ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి.
గీత కార్మికుల ప్రమాదాల నివారణకై రక్షణ కవచాలు
నర్సంపేట,నేటిధాత్రి :
కళ్లు గీత కార్మికులు వృత్తిరీత్యా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తున్నారని వారిని నర్సంపేట డివిజన్ పరిధిలోని విడతల వారీగా అందిస్తామని ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలం సర్వాపురం గ్రామం రేణుక ఎల్లమ్మ వద్ద గల తాటి వనంలో సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్ అధ్యక్షతన డివిజన్ లోని 6 మండలలాలకు చెందిన గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొదటి విడత డివిజన్ లోని 33 మంది గీత కార్మికులకు రక్షణ కిట్లు మంజూరు చేసిందనారు. రెండో విడత మరో 50 మంది గీత కార్మికులకు కిట్లు మంజూరు చేస్తుందన్నారు.ప్రభుత్వం అందించే పథకాలను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రతి గీత కార్మికుడు ట్రయినర్లు చెప్పిన సూచనలు పాటించి శిక్షణ పొందాలని నరేష్ రెడ్డి సూచించారు.గీత కార్మికులకు ప్రమాదాలు జరుగకుండా నివారించడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తున్నదని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన రక్షణ కిట్లు ధరించడం ద్వారా ప్రాణాపాయం ఉండదన్నారు.సొసైటీ సభ్యులకు మాత్రమే కాకుండా ఏజెన్సీ గీత కార్మికులకు కూడా కాటమయ్య రక్షణ కవచాలు ప్రభుత్వం అందించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఆబ్కారి ఎస్ఐ ఆర్. రాజయ్య, బీసీ వెల్ఫేర్ అధికారులు భాస్కర్, నరేందర్, ట్రైనర్లు తాళ్లపెల్లి నర్సయ్య గౌడ్, నరేష్,ప్రవీణ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా కార్యదర్శి కొండి రాము గౌడ్, గంధసిరి సంబరాజ్యం గౌడ్, మర్ద సురేష్ గౌడ్, కక్కెర్ల నాగయ్య గౌడ్,పొగాకు రమేష్ గౌడ్, మనోహర్ గౌడ్,గట్టు సమ్మయ్యగౌడ్, పూజారి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.