ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త విశ్వకర్మ ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 97 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. అనంతరం జిల్లా నాయకులు నాగవె ల్లి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని అన్నారు. రాష్ట్రం కోసం మలి దశ ఉద్యమంలో విశ్వకర్మ శ్రీకాంత్ చారి బలిదానం చేసుకున్నాడు. విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేకంగా జయంతి కోసం పులిహోర ప్యాకెట్లు వివేకానంద విద్యాలయం విద్యార్థులకు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్,గ్రామ అధ్యక్షులు నూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నాగల మల్యాల రమేష్ చారి, కోశాధికారి లక్ష్మణాచారి,ప్రధాన కార్యదర్శి తాటికొండ వెంకటేశ్వర్లు,నాగవె ల్లి సంతోష్, నూతి శంకర్,పోలోజు రమేష్,నూతి శ్రీనివాస్ ప్రతాప్,సత్యం,శంకరయ్య,రమేష్, బ్రాహ్మండ్లపల్లి భీమయ్య, ఎర్రోజు నారాయణ, వెలీషోజు రవీంద్ర చారి. శ్రీధర్. కొండపాక నరసింహ చారి, వరుణ్, వెలిసోజు బ్రహ్మచారి, శంకరాచారి, శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.