జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : టిడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ప్రతి జర్నలిస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి

పెద్దపల్లి :- నేటి ధాత్రి

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు,జిల్లా ఇంచార్జి వల్లాల జగన్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు.జర్నలిస్టులందరికి వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.జర్నలిస్టులకు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి,ఉద్యోగుల మాదిరిగా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిందని,వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని అన్నారు.ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని అన్నారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఉచిత బస్ సదుపాయం కల్పించాలని అన్నారు.రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణి సుదర్శన్, నాయకులు ఇరుకుల్ల వీరేశం,సాబీర్ పాషా, సబ్బు సతీష్, చొప్పరి సుమన్,పూసాల రవి,జంగపల్లి సాగర్, సల్ఫాల ప్రశాంత్,శ్రీనివాస్,శోభన్,ప్రభాకర్ స్వామిలతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!