జమ్మికుంట :నేటిధాత్రి
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అటెండర్, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం జమ్మికుంట పట్టణం లోని బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొన్ని పాఠశాల భవనాలు శిిలావస్థకు చేరుకున్నాయని వాటికి నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. మంచి నీటి సౌకర్యం లేక విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలని పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ, అటెండర్, స్కావెంజర్ మరియు పీటీ టిచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి.. పథకం ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రతి పాఠశాలలో ఈ పథకం వర్తించేలా ప్రభుత్వ చుడాలని విష్ణు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇల్లందుల శ్రీనాథ్, మొలుగూరి వినయ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.