లక్ష్మీపల్లి లో అట్టహాసంగా ప్రగతి పత్రాల ప్రదానోత్సవం..

అలరించిన విద్యార్థుల నృత్యాలు..

ఘనంగా 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల లో మంగళవారం రోజు విద్యార్థులకు ప్రగతి పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి మంగళం వారం పాఠశాలకు ఆఖరి పనిదినం సందర్భంగా పాఠశాల హెచ్ ఎం జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ( పి టి యం) విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 వ తరగతి వరకు విద్యను అభ్యసించి ఆయా తరగతుల్లో ఉత్తీర్ణత ను సాధించిన విద్యార్థులకు ప్రగతి పత్రాల ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హెచ్ యం మాట్లాడుతూ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో విద్యాభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో బడి ఈడు కలిగిన ప్రతి ఒక్కరినీ బడి లో చేర్చాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలకు మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టం తో కాకుండా ఇష్టం తో చదువుకోవాలని సూచించారు. తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టే విధంగా చదువులో రాణించాలని కోరారు.
శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ కో ఆర్డినేటర్ జగ్గప్ప మాట్లాడుతూ
వేసవి సెలవుల్లో ఎక్కడకు తిరగ కుండా చదువు పై శ్రద్ధ చూపాలని కోరారు. వేసవి కారణంగా విద్యార్థులు ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 5 వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము చదువుకున్న పాఠశాలకు గుర్తుగా గోడ గడియారం ను బహూకరించారు .అనంతరం 5వ తరగతి విద్యార్థులకు 4 వ తరగతి విద్యార్థులు జ్ఞాపికలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరి హృదయాలను అలరింప జేశాయి. కాగా ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి వెంకట్రాములు, పాఠశాల హెచ్ ఎం జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్,బాసిద్, ఎస్.కల్పన, విద్యా వాలింటర్ వెంక ట్రాములు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!