మంగపేట నేటి ధాత్రి
________
సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించడం వల్ల జరిగే మకర సంక్రమణం నే మకర సంక్రాంతి గా తెలుగు ప్రజలు జరుపుకునే ఎంతో ప్రాముఖ్యమైన విశిష్టమైన పెద్ద పండుగ అని,పండుగలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలు ను మర్చిపోకుండా విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యత ను,విశేషాన్ని తెలియచేయడానికి సందర్భోచితంగా ఉపయోగకరంగా ఉంటాయని మంగపేట ఉన్నత పాఠశాల
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పోదెం మేనక అన్నారు.
శుక్రవారం రోజున ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక ,ఉన్నత పాఠశాల విద్యార్థులతో తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా కొత్త పంటలు ఇంటికి వచ్చే సమయానికి చేసుకునే మకర సంక్రాంతి పండుగ సంబరాలను ముందస్తుగా నిర్వహించారు.ఈ సందర్భంగా భోగిమంటలు ఏర్పాటుచేసి , రంగవల్లులు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందించడం జరిగింది.ఈ సంబరాలలో విద్యార్థులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి,సామ్రాజ్యం , ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి మరియు ఉన్నత ,ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యారిని విద్యార్దులు పాల్గొన్నారు.