చేర్యాల నేటిధాత్రి…
స్థానిక చేర్యాల మండలం చేర్యాల మున్సిపాలిటీలో చేర్యాల 11 అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ నాగమణి అధ్యక్షతన డి ప్రైమరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం అయినది. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు అలరించారు.ఈ సందర్భంగా తల్లులతో సూపర్వైజర్ నాగమణి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ కృష్ణవేణి పిల్లలకు ఏ టు జెడ్ వరకు అక్షర పరిచయాలు, తెలుగు అక్షరాల వర్ణమాల, అంకెల పరిచయాలు,,ఆటలు,కథలు, సృజనాత్మకత, మంచి అలవాట్లు, భాషా పరిచయం ఇంగ్లీషు, తెలుగు, శాస్త్రీయ పరిజ్ఞానం, సాంస్కృతిక కార్యక్రమంలో స్కూల్ డే లో సంవత్సరం మొత్తం నిర్వహించినవి పిల్లలతో చేపించి తల్లులకు చూపించడం జరిగింది… అలాగే అంగన్వాడి కేంద్రాలకే పిల్లలను పంపించాలని కోరడమైనది… ఏప్రిల్ నెలలో జరిగే అన్యువల్ డే లో పిల్లలతో డాన్సులు చేపించడం జరిగింది… పిల్లలకు మూడు నెలలకు ఒకసారి అసెస్మెంట్ కార్డులలో పిల్లలు చేసిన యాక్టివిటీస్ మీద స్టార్స్ గుర్తించి వారికి ప్రోగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది… ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు సర్టిఫికెట్స్ ఇచ్చి పిల్లలను సంసిద్ధం చేయడం జరుగుతుందని అంగన్వాడి టీచర్ వివరించడమైనది… ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శోభ, గర్భిణీలు, బాలింతలు,ఫ్రీ స్కూల్ పిల్లల తల్లులు పాల్గొనడం జరిగింది..