చందుర్తి, నేటిదాత్రి:
మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుండి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తు బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించారు.చిన్నారులు, పాఠశాల అధ్యాపక బృందం వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో సంబరంగా గడిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తిపాక నాగరాజు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో గొప్పదైన బతుకమ్మ వేడుకలు పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రపంచమంతా దేవుళ్లను పూలతో పూజిస్తూ ఉంటే, పువ్వులనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక బృందం తరఫున మండల బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.