ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత వాహనాల పత్రాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్ఐ ఈ సందర్భంగా ఎస్సై జి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆటోలకు సంబంధిత ధ్రువ పత్రాలు ఉండాలని ఆటోలకు బండి పత్రాలతో పాటు పాటు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మొదలగు పేపర్లతో పాటు డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ ఉండాలని ఆటోలకు సీరియల్ నెంబర్లు ఉండాలని అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు టర్నింగ్ వద్ద వేగంగా పోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించకూడదని ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సై జి అశోక్ రెడ్డి ఏఎస్ఐ సుధాకర్, ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు