చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల కేంద్రంలోని మున్సిపాలిటీ లో ఉన్న 9వ అంగన్వాడి కేంద్ర పరిధిలోని అంగన్వాడి టీచర్ల సమక్షంలో చేర్యాల ప్రాజెక్టు సిడిపిఓ శారదా, సూపర్వైజర్ నాగమణి, ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం కురుమవాడ అంగన్వాడి సెంటర్ వన్ లో ఘనంగా జరుపుకోవడం అయినది. ఇందులో భాగంగా సిడిపిఓ శారదా మాట్లాడుతూ గర్భిణీలు పోషకాహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. అలాగే ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలన్నారు. పిల్లల తల్లులకు ఇచ్చిన గ్రోత్ కార్డు లలో బరువు సూచించిన విధంగా ఉండాలని ప్రతి నెల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకువచ్చి పిల్లల బరువులు ఎత్తు లు తనిఖీ చేయించి వారి ఎత్తు బరువు, పెరిగేలా చూడాలని చెప్పారు అలాగే ఫ్రీ స్కూల్ కు వచ్చే పిల్లలను ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడి కేంద్రాలకు పంపిస్తే ఆటపాటల విద్యతో పాటు అంగన్వాడి టీచర్లు పిల్లలను తల్లులుగా చూసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే పోషణ పక్షంలో భాగంగా చిరుధాన్యాలపై తల్లులకు కిశోర బాలికలకు వృద్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ టీం కనకరాజు, అంగన్వాడీ టీచర్లు,ఆశాలు,ఆయాలు,గర్భిణీలు,బాలింతలు, తల్లులు పాల్గొనడం జరిగింది.