భద్రాచలం నేటి దాత్రి
మహబూబాబాద్ పార్లమెంట్
భద్రాచలం నియోజకవర్గం
ఈరోజు భద్రాచలం నియోజకవర్గ దుమ్ముగూడెం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్
ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో క్షణక్షణం చాలా విలువైనదని యువకులు విలువైన సమయాన్ని బంగారు భవిష్యత్తు కోసం కేటాయించాలని, ఉన్నతమైన చదువులు, క్రీడల తోపాటు తల్లిదండ్రులను దైవంగా భావించి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని గెలిచినవారు ఓడినవారు ఎలాంటి బావోగ్వేదాలకు లోను కాకుండా క్రీడా స్ఫూర్తితో మెలగాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినీల్ రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ జూలకంటి సీతారాం రెడ్డి,పినపాక నియోజకవర్గ నాయకులు బట్టా విజయ గాంధీ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రదీప్,నాయకులు సతీష్ తదితరులు ఉన్నారు.