ఎండపల్లి నేటిధాత్రి
ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన పొన్నం విఘ్నేష్ గౌడ్ జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యాడు. ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విఘ్నేష్ చదువుల్లో మొదటి నుండి తన ప్రావీణ్యాన్ని చాటేవాడు, వేల మంది విద్యార్థులు పోటీపడే, జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం,తద్వారా ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయంలో ప్రవేశానికి అర్హత సాధించాడు. పొన్నం విఘ్నేష్ గౌడ్ విజయానికి తోడ్పడిన గుల్లకోట ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు చందూరీ రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం రమాదేవి కృష్ణారెడ్డి శ్రీనివాస్ నరేష్ శ్రీలత శిరీష లకు విద్యార్థి తల్లి తండ్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.