రఘునాథపల్లి సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు
రఘునాథపల్లి తాసిల్దార్ కు వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు
రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి:-
మండలంలోని చెరువులను కుంటలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని నింపి రైతుల పంటలకు నీరు అందించాలని సిపిఎం రఘునాథపల్లి మండల కార్యదర్శి గంగాపురం మహేదర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు డిమాండ్ చేశారు. బుదవారం రోజున సిపిఎం రఘునాథపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులను కుంటలను నింపాలని కోరుతూ రఘునాథపల్లి తాసిల్దార్ యుగేంధర్ గారికి మెమోరాండం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న చెరువులు, కుంటలను నింపి ఎండిపోతున్న పంటలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కుర్చపల్లి మల్లంపల్లి చెరువులకు దేవాదుల కాల్వ ద్వారా నీలు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వేసవికాలం సమీపిస్తున్న సందర్భంలో రెండు నుంచి మూడు మీటర్ల లోతు భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువు ఏర్పడే ప్రమాదం ఉందని వారన్నారు. రఘునాథపల్లి మండల ప్రాంతంలో వరి పంటలు ప్రధాన పంటలుగా ఉన్నాయని బోర్ బావులు వ్యవసాయ వాగుల ద్వారా 40వేల హెక్టార్లలో భూమిని సాగు చేస్తున్నారని జనగామ జిల్లా ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ఎత్తైన ప్రాంతంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు తొందరగా అడుగంటిపోయి ఉన్నాయని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పంటలు ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో వడగండ్ల వాన ద్వారా వేలాది ఎకరాల పంటలు నష్టపోయి ఉన్నారని ఇప్పటివరకు రైతులకు పంట నష్టపరిహారం అందలేదన్నారు. ప్రభుత్వ అధికారులను అడిగితే ఎనిమిరేషన్ జరిగిందని ప్రభుత్వం దగ్గర నుండి నిధులు విడుదల కావడం లేదన్నారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వడగండ్ల వాన ద్వారా పంటలు నష్టపోయిన రైతన్నకి ఎకరానికి 50వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని వారు కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు షాగ సాంబరాజు, రవి ఐల్లయ్య,రాజు,అంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.