వ్యాపారాన్ని కనిపించేలా చేస్తున్న రాజకీయాలు..

# అంగట్లో సరుకుల్ల కోట్లాది రూపాయల ఓటర్లను కొనబోతున్నారు.

# ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్.
# పట్టణంలో భారీగా ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి వెళ్లిన ఎంసీపీఐ పార్టీ అభ్యర్థి..

నర్సంపేట,నేటిధాత్రి :
రాజకీయాలు వ్యాపారాన్ని కనిపించేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు కనబడుతున్నాయని ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పెద్దారపు రమేష్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కాగా నర్సంపేట నియోజకవర్గ ఎంసిపిఐ పార్టీ అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన ప్రజా నాయకుడు ఎంసిపిఐ పార్టీ అభ్యర్థి పట్టణంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారానికి తన నామినేషన్ అందజేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలో నర్సంపేట అసెంబ్లీ టైగర్ మధికాల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా డప్పు చప్పులతో ర్యాలీ ప్రదర్శించారు. నామినేషన్ వేసిన అనంతరం పెద్దార రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంలో మోడీ సర్కార్ పాలడ వలన పేదల కష్టాలు మరుగునపడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో తింటున్నారని ఆరోపించారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిన కెసిఆర్ పార్టీ, గతంలో పాలించి స్కాముల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డ ఓంకార్ ఆయన ఆశయ సాధన కోసం శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు పెదాల రమేష్ ప్రకటించారు. నర్సంపేట నియోజకవర్గం కార్మికులు,కర్షకులు ఉన్న ప్రాంతం వారి అభివృద్ధి కోసం
అధికార,ప్రతిపక్ష పార్టీలను ఒడించాలని పెద్దారపు రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి,జిల్లా కమిటీ సభ్యులు సంగతి మల్లికార్జున్, ఎన్నికల ఇంచార్జి కుసుంబా బాబూరావు, నాయకులు గోని కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, మంద రవి, వంగల రాగసుధ, రాజసహేబ్, కొమురయ్య, కన్నం వెంకన్న, గడ్డం నాగార్జున, సావిత్రి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *