చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని పాసిగడ్డ తండా గ్రామానికి చెందిన లావుడియా రాజు, లావుడియా తిరుపతి లు మొరంచపల్లి వాగు పక్కన గుడుంబా బట్టిలు పెట్టుతున్నట్లు సమాచారం తెలుసుకొని స్థానిక ఎస్సై జంగిలి రమేష్, సిసిఎస్ ఎస్ఐలు శ్రావణ్, భాస్కరావులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. అందులో భాగంగా ఇద్దరి దగ్గర 25 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పోలీస్ సిబ్బంది నవీన్ సురేందర్, రవి, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.