ఓటు హక్కు పై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ

చందుర్తి, నేటిదాత్రి:

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గురువారం చందుర్తి మండలం లోని కిష్టంపేట , మల్యాల అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల చేత భారత పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛా, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మరియు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మరియు ప్రభావం లేకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞలు చేయించి అవగాహన కల్పించారు. “ ప్రతి సంవత్సరం ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు పుష్పలత, సంటి సంధ్య,తూం అనిత, ద్యావనపల్లి జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version