తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అక్తర్ ( రిటైర్డ్ హైకోర్టు జడ్జి )కి దళిత సంక్షేమ సంఘం తరఫున వినతి పత్రం.
భద్రాచలం నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ చేపట్టాలని, వర్గీకరణ ద్వారానే షెడ్యూల్ కులాలకు సామాజిక న్యాయం సమన్యాయం జరుగుతుందని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య ఒక వినతిపత్రం అందజేయడం జరిగింది.
అదేవిధంగా ఏజెన్సీ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు చాట్ల రవికుమార్ వర్గీకరణ ద్వారానే ఎస్సీ లోని అన్ని కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
తెలంగాణ మాదిగ దండోరా తరఫునుంచి జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.