ఎన్నికల నియమావళి కనుగుణంగా విధులు నిర్వర్తించాలి

# జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి.ప్రావీణ్య
# వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్.

నర్సంపేట,నేటిధాత్రి :

ఎన్నికల నియమావళి కనుగుణంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు.మంగళవారం కలెక్టర్
వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి నిర్వహిస్తున్న రికార్డ్ లను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా డబ్బు, మద్యం, అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని న్నారు. జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లైయింగ్ స్క్యా డ్స్ బృందాలు,9 స్టాటిస్టికల్ సర్వేలెన్ టీంలు, 9 వీడియో వ్యువింగ్ టీం లు నియమించగా నర్సంపేట నియోజకవర్గంలో 3 బృందాల చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో గల స్ట్రాంగ్ రూమ్ లను, ఈవిఎం, గోడౌన్ ల వద్ద రక్షణ, భద్రతను కలెక్టర్ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.అనంతరం కలెక్టర్ ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితాను పరిశీలించి పెండింగులో ఉండకుండా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో కృష్ణవేణి, ఏసీపీ తిరుమల్ రావు, ఎమ్మార్వో విశ్వ ప్రసాద్ , సంబంధిత ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version