వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బుధవారం రోజున ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణం లోని పోచమ్మ ఆలయం నుండి మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు ప్రచార కార్యక్రమంలో మరియు 9 వ వార్డ్ లోని పద్మశాలి సంఘంలో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఈ సమావేశంలో ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలుపెద్ద ఎత్తున వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు,ఈ సందర్భంగా నవంబర్ 30వ తేదీన జరిగే ఎలక్షన్ లో మా యొక్క ఓటును బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు ప్రజలు తెలియజేశారు.