ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్
పార్టీ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ విషయం లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి..
ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో 20వేల కోట్లు దండుకునేందుకు 25 లక్షల కుటుంబాలపై అధిక భారం మోపుతుందన్నారు..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా చేయాలి… చేసే వరకు వదిలిపెట్టం… బిఆర్ఎస్ తరఫున పోరాడుతమని అన్నారు..
ఈ కార్యక్రమంలో
జిహెచ్ఎంసి స్టాండింగ్ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, గ్రేటర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సాయిజన్ శేఖర్,మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి , గంధం జ్యోష్ణ నాగేశ్వర్ రావు డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉద్యమ నాయకులు, మహిళా నాయకురాలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు