భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థులకు నానా ఇబ్బందులు గురిచేస్తూనేఉంది దీని నిరసిస్తూ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ
ఆధ్వర్యంలో ఆర్డిఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పట్టణ కార్యదర్శి చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం బకాయిలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చెయ్యలేదు, మరోపక్క గత మూడు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించలేక , ప్రైవేటు డిగ్రీ ,పీజీ కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటి అద్దె చెల్లించ లేకుండా నాన్న యాతన పడుతాం పడుతూ కళాశాల నడుపుతుంటే వారు కూడా నిన్నటి నుండి రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పీజీ కళాశాలల బందుకు పూనుకోవడం జరిగిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తకుండా వివరిస్తున్నది. ఒకపక్క విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతుంటే, రానున్న రోజుల్లో సెమిస్టర్ పరీక్షల దగ్గరకు వస్తున్న సందర్భంలో తరగతులు నిర్వహణ లేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది.. ఇలాంటి వాటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేనటువంటి పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం